ఆర్జీవి…ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి సినిమా తీస్తాడో అంచనా వేయలేరు.ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ను, ఇతరుల జీవితాల సంబంధించిన ఆసక్తికర అంశాలను వివాదాలుగా మార్చి సినిమాలు తీయడం రాంగోపాల్ వర్మకు వెన్నెతో పెట్టిన విద్యలా మారింది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న మరో వివాదస్సద చిత్రం ట్రయిలర్ నేడు విడుదలై హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్‌ను చూసిన పవర్‌స్టార్ అభిమానులు వర్మను సోషల్‌మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వర్మపై పరాన్నజీవి అంటూ ఓ సినిమాను రాత్రిబవళ్లుకష్టపడి రూపొందిస్తున్నారు.
అయితే ఇలాంటివి వర్మ పట్టించుకోడు.. తనపై తీసిన సినిమాతో కూడా పబ్లిసిటి సంపాందించగల ఉద్దండుడు వర్మ. తాజాగా పవర్‌స్టార్ విషయంలో హీరోలు కూడా వర్మపై సోషల్‌మీడియాలో స్పందిస్తున్నారు. అయితే మొదట్నుంచీ వర్మ బిహేవిషయర్‌ను పరిశీలిస్తున్నపవన్‌కల్యాణ్‌కు పవర్‌స్టార్ ట్రైలర్ గురించి తెలియడంతో త్వరలోనే వర్మ ఆగడాలకు అడ్డుకట్టపడే విధంగా త్వరలోనే స్పందించాలని నిర్ణయించుకున్నారు.
260 Replies to “పవర్‌స్టార్‌పై పవన్ స్పందిస్తాడా?”
Comments are closed.