తన ప్రతీ చిత్రంలో సామాజిక సందేశం వుండేలా చూసుకునే కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ. నిజజీవితంలో కూడా ఆయన సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వుంటాడు. కరోనా విషయంలో పలు మార్లు స్పందించిన కొరటాల శివ ఈ సారి మరింత ఘాటుగా స్పందించాడు. ‘ఇంత చెబుతున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా వుండదు. ఈ వ్యాధి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు, మూతి కవరయ్యేలాగా… మెడ మీద కాదు ) వేసుకొని వాళ్లకు పనిమాల చెబుదాం’ అంటూ ట్విట్టర్‌లో పో స్ట్‌చేశాడు దర్శకుడు కొరటాల శివ.
