హైదరాబాద్ : ప్రస్తుతం ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఓ దగ్గర ఉండాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందాల బామ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు మకాం మార్చిందట. రకుల్‌ప్రీత్ సింగ్ సినిమాలే కాకుండా ప్రత్యామ్నాయ వ్యాపారాల్లో కూడా ఉన్నవిషయం తెలిసిందే.
హైదరాబాద్ లో సొంతంగా జిమ్ ట్రైనింగ్ సెంటర్ ను నిర్వహిస్తోంది. మరోవైపు వైజాగ్ లో కూడా ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు కూడా పెట్టిందట. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కొనుగోలు చేసిన లగ్జరీ అపార్టుమెంట్ కు మకాం మార్చినట్టు వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రకుల్ మెడిసిన్స్ కొనుక్కునేందుకు ముంబై రోడ్లపైకి వస్తే..రకుల్ చేతుల్లో మద్యం ఉన్నట్టు నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.